టార్గెట్ కావూరి.. !

Kavuri-Sambasivaకేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకి సమైవాదులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడికెళ్లిన.. అక్కడే అడ్దుకొని ముందుకు వెళ్లకుండా.. మరో రకంగా చెప్పాలంటే.. బంధిస్తున్నారనే చెప్పుకోవాలి. గతంలో పలుమార్లు ఆయన్ను సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈరోజు (మంగళవారం) ఉదయం రెండు సార్లు కాపుకాసి మరీ కావూరి అడ్డుకున్నారు. అంతటితో వదిలి పెట్టకుండా.. పశ్చిమగోదావరి, ఏలూరులోని ఆయన నివాసం వద్ద హల్ చల్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గీయులు, సమైక్యవాదులు కావూరి ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో, కావూరి వర్గీయులు, చింతమనేని వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అయితే, కావూరి టార్గెట్ చేయడానికి ప్రధాన ఏమిటని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. పైగా నేను సమైక్యవాదినని, విభజిన దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదని పదే పదే చెబుతున్నప్పటికినీ.. ఆందోళనకారులు ఆయన్ను వదలడం లేదు. కావూరి కేకలు ఎలా వున్నా… సమైక్యవాదల మదిలో వున్నది మాత్రం కావూరికి మంత్రి పదవిని కట్టబెట్టడంతోనే విభజన ప్రక్రియ మొదలైందని.. ఈ విషయంలో కావూరి కాంప్రమైజ్ అయిన తరువాతనే అధినేత్రి ముందుకెళ్లి విభజన ప్రకటన చేశారని అనుకుంటున్నారట. అదీ నిజమేనేమో.. అందుకే సమైక్యవాదులు టార్గెట్ కావూరి అంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.