కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపింది ఏపీ హోంమంత్రి తానేటి వనిత. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ … 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఇదేమి ఖర్మ కార్యక్రమాన్ని చూసి ప్రజలు మాకు ఇదేమి ఖర్మ, ఇలాంటి ప్రతిపక్షం ఏంటని బాధపడుతున్నారు.
కందుకూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.