Site icon TeluguMirchi.com

జగన్ ను కాకుండా చంద్రబాబు డైనమిక్ లీడర్ అంటూ తమ్మినేని ప్రశంసలు..ఆ తర్వాత

రాజకీయ నేతలు తమ ప్రసంగాలలో అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అయ్యి నాలుక కరుచుకుంటారు. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం తాజాగా అలాగే టంగ్ స్లిప్ అయ్యాడు. నిన్న రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ… కరోనా కట్టడికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించకుండా ఉండలేమని తమ్మినేని అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు, సచివాలయాల కాన్సెప్ట్‌ల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టే కోవిడ్ నివారణ చర్యలను తీసుకెళ్లే అద్భుతమైన యంత్రాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పుకొచ్చారు.

ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారని, చంద్రబాబు నాయుడి డైనమిక్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే తప్పు తెలుసుకున్న స్పీకర్ తమ్మినేని మన జగన్మోహన్‌రెడ్డి గారు అంటూ మాటను సవరించుకున్నారు.

Exit mobile version