Site icon TeluguMirchi.com

లాక్ డౌన్ ప్రకటించిన తమిళనాడు


కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడులో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటన చేశారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ రేపటితో ముగుస్తుండగా.. ప్రధాని మోదీ తదుపరి ప్రకటన రాకముందే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నాయి.

తాజా ఆ రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా చేరింది. తమిళనాడులో ఇప్పటివరకు 982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 50 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు.

కాగా దేశంలో రేపటితో ముగియనున్న లాక్‌డౌన్‌ కొనసాగింపుపై రేపే స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రకటన చేయనున్నారు

Exit mobile version