Site icon TeluguMirchi.com

పన్నీర్‌ వర్గంను ఇరుకున పెట్టిన స్టాలిన్‌

Stalin-and-O-Panneerselvamతమిళనాట మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ స్థానంకు ఎన్నికల కమీషన్‌ ఉప ఎన్నికల నగారా మ్రోగించింది. ఈ స్థానంను దక్కించుకునేందుకు నలుగురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యమైన వారు శశికళ వర్గం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న అన్నాడీఎంకే ఈ స్థానంను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అమ్మ వారసులం తామే అంటూ నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జయలలిత మేనకోడలు అమ్మకు అసలు వారసురాలిని నేను అంటూ చెప్పుకుంటూ రంగంలోకి దిగుతుంది. ఆమెతో పాటు పన్నీర్‌ సెల్వం మరియు డీఎంకే కూడా ఎన్నికల బరిలో నిలిచింది.

పన్నీర్‌ సెల్వం మద్దతు ఇస్తున్న మధుసుదన్‌కు అనుకూలంగా పరిస్థితు ఉన్నాయి. దాంతో డీఎంకే అధినేత స్టాలిన్‌ ఎక్కువగా పన్నీర్‌ వర్గంపై విమర్శలు ఎక్కు పెడుతున్నాడు. తాజాగా జయలలిత మరణం వెనుక రహస్యాలున్నాయి, శశికళ బండారం బయట పెడతాను అంటూ వ్యాఖ్యలు చేసిన పన్నీర్‌ సెల్వం ఆ రహస్యాలు ఏంటి అనేది బయట పెట్టాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాడు. ఆ 90 శాతం నిజాలు ఏంటో బయట పెట్టిన తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు రావాల్సిందిగా స్టాలిన్‌ సవాలు విసిరాడు. స్టాలిన్‌ వ్యాఖ్యలతో పన్నీర్‌ వర్గం ఇరుకున పడ్డట్లయ్యింది. అందుకు సమాధానంగా పన్నీర్‌ సెల్వం ఘాటుగా స్పందించాడు.

డీఎంకే ఓటమి భయంతో ఇలా మాట్లాడుతుందని అన్నాడు. 2006వ సంవత్సరంలో తనను అమ్మకు శశికళ దూరం చేయాలని చూస్తుంది. అందుకు సంబంధించినవే ఆ 90 శాతం నిజాలు అంటూ పన్నీర్‌ సెల్వం చెప్పుకొచ్చాడు. మాటల యుద్దం కొనసాగుతుంది, అమ్మకు వారసులం మేం అంటే మేం అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. చివరకు ఆర్కే నగర్‌లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో?

Exit mobile version