Site icon TeluguMirchi.com

తమిళనాడు గవర్నర్ సేఫ్

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదనే సంగతి తెలిసిందే. సామాన్య ప్రజల దగ్గరినుండి సినీ , రాజకీయ , బిజినెస్ , క్రీడా ఇలా అన్ని రంగాలవారిని వణికిస్తోంది. ఇప్పటికే దీనిబారిన పడిన రాజకీయనేతలు కొంతమంది క్షేమంగా బయటపడగా, మరికొంతమంది దీనికి బలయ్యారు.

తాజాగా తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (80) కరోనా ను జయించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో రెండు వారాల క్రితం భన్వరీలాల్ టెస్ట్ చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రి వైద్యులు ఆయనను 24 గంటలూ పర్యవేక్షిస్తూ వచ్చారు. చికిత్స తరవాత ఆయన తాజాగా మళ్ళీ పరీక్ష చేసుకోగా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన చురుగ్గా ఉన్నారని, ధైర్యం, సంకల్పం వల్లే ఆయన త్వరగా బయటపడగలిగారని డాక్టర్ లు తెలిపారు.

Exit mobile version