Site icon TeluguMirchi.com

ఇక సమరమేనా.. ?

sonia-gandhi-telanganaరాష్ట్ర విభజనపై కేంద్రం వేగంగా అడుగువేస్తోంది. ఈరోజు (గురువారం) సాయంత్రం జరగబోయే కేంద్ర కేబినెట్ లో తెలంగాణ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లు విభజనను అడ్డుకొని తీరుతాం, టీ-నోట్ వస్తే సమరమేనని ప్రకటించిన సీమాంధ్ర నేతలు ఇప్పుడు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ’టీ-నోట్ సిద్దం..కేబినేట్ కి టీ నోట్’ అనే వార్తలు వినగానే సీమాంధ్ర నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తినట్లు తెలుస్తోంది. అందుబాటులో వున్న సీమాంధ్ర నేతలు హుఠాహుఠిన సమావేశమవుతున్నారు. ఇప్పటికే మంత్రి టీజీ వెంకటేష్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో సమావేశమయి టీ-నోట్ గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఎంపీ రాయపాటి ఇక సమరమేనని ప్రకటించారు. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుబాటులో వున్న నేతలతో మంతనాలు జరుపుతూనే.. మరోవైపు ఎంపీలతో ఫోన్ లో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈరోజు టీ-నోట్ కేబినెట్
ఆమోదం పొందినట్లయితే, రేపు గానీ, ఎల్లుండి గానీ రాష్ట్రపతి వెళ్లనుంది. అనంతరం ఈ నెల 14, 15 తేదీలల్లో రాష్ట్ర అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం.

రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ నోట్ అతి త్వరలోనే రానున్న నేపథ్యంలో.. సీమాంధ్ర నేతలు ఎలా స్పందిస్తారు.. ? నోట్ ఆమోదాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటురాన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మూకుమ్మడి రాజీనామాలకు పూనుకుంటారా.. ? లేదా ఆది నుంచి విభజనను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా..? అనేది వేచి చూడాలి. ఏదేమైనా.. సీమాంధ్ర నేతలు ఇక సమరం తప్పదని మాత్రం వెల్లడిస్తున్నారు. అయితే, ఆ యుద్ధం ఎలా వుండబోతున్నది వేచి చూడాలి.

Exit mobile version