Site icon TeluguMirchi.com

కిరణ్ తో మనకేం పని.. ?

telangana congress leadersముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బహిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నిన్న జరిగిన టీ-నేతల సమావేశంలో.. ఈ అంశంపై హాట్ హాట్ గా చర్చజరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సీఎం సీమాంధ్ర నేతలతో మాత్రమే సమావేశమవుతున్నారు. తెలంగాణ నేతలతో భేటీ అంటేనే.. ’నో’ అని తెగేసి చెబుతున్నాడంట. ఇక, టీ-ఎంపీలతో మొహం చూడ్డానికే మొహమాటపడుతున్నాడంట. ఈ నేపథ్యంలో.. మనతో పనిలేని కిరణ్ తో మనకేం పని.. ? అని ప్రశ్నిస్తున్నారు టీ నేతలు. ఇదే విషయాన్ని నిన్న జరిగిన టీ-నేతల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే, మధుయాష్కీ అభిప్రాయంతో… చాలా మంది టీ-నేతలు అంగీకరించడం విశేషం. మొన్నటి వరకు కిరణ్ సీమాంధ్రకే సీఎంగా వ్యవహరిస్తున్నారంటూ.. ఒకరిద్దరు మాత్రమే విమర్శించేవారు.. ఇప్పుడు అది మొత్తం టీ-నేతల అభిప్రాయంగా మారింది. ఈ నేపథ్యంలో.. కిరణ్ ముఖ్యమంత్రిగా ఇంకెంత కాలం కొనసాగుతారు.. ? అన్న దానిపై అప్పుడే సందేహాలు కూడా స్టార్ అయ్యాయి.

Exit mobile version