Site icon TeluguMirchi.com

మళ్లీ ఉద్యమ బాట.. ?

T-JACతెలంగాణ రాజకీయ జేఏసీ ఈరోజు (శుక్రవారం) అత్యవసరంగా సమావేశం కానుంది. టీ-బిల్లుపై సభలో ఎలాంటి చర్చ జరగకుండానే శాసనసభ జనవరి 3 వరకు వాయిదాపడిన నేపథ్యంలో.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గానూ.. టీ-జేఏసీ సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్వీకర్ నాదెండ్ల మనోహర్ తీరుపై చర్చించనున్నారు.

ముఖ్యమంత్రి మొండిగా.. ఇలానే విభజనకు అడ్డుపడుతుంటే.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై టీ-జేఏసీ దృష్టిసారించింది. అవసరమైతే.. మరోమారు మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తెరాస అధినేత కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. జనవరి 3వరకు అసెంబ్లీ సమావేశాలు లేనందున.. ఈ మధ్య కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇటు టీ-జేఏసీ, అటు తెరాసలు దృష్టిసారించాయి. టీ-ప్రక్రియపై ఎలాంటి జాప్యం జరిగినా.. మళ్లీ ఉద్యమ బాట పట్టాలని టీ-జేఏసీ యోచిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version