Site icon TeluguMirchi.com

ఊరూరా కాంగ్రెస్ జెండా.. !

t congressటీకాంగ్రెస్ నేతల సమావేశం వాడివేడిగా సాగింది. రేణుకా చౌదరిని సమావేశానికి ఆహ్వానించడంపై కొద్దిసేపు వాగ్వాదం జరిగినా సమావేశం కొనసాగింది. ముఖ్యంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలా వద్దా అనే విసయం పై తీవ్రమైన చర్చ జరిగింది. చివరికి తెలంగాణలోని అన్ని కాంగ్రెస్ కార్యాలయాలలో ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేవిసయమై అధిష్టానంతో చర్చించేందుకు ఈనెల 22న గానీ 26నగానీ ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీని కలవాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పరిస్తితులను మేడంకు నివేదించే అవకాశం ఉంది. ఊరూరా కాంగ్రెస్ జెండా ప్రజలకు అండ పేరుతో ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో మొత్తం ఎనిమిది తీర్మాణాలు చేశారు. ఈ నెల 17 నుంచి వారంరోజులపాటు తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్సే అనే నినాదంతో ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు.

Exit mobile version