Site icon TeluguMirchi.com

అమ్మ హామి ఇచ్చిందట.. !!

t congress leaders mee soniaతెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు అమ్మ (సోనియా గాంధీ) హామి లభించిందట. ఇంతకీ ఏ విషయంలో అనే డౌటు కలగక మానదు. అదేనండీ.. సంపూర్ణ తెలంగాణ అంశంపై. జీవోఎం రాయల ’టీ’ ప్రతిపాదన చేసిందన్న వార్తల నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కట్టగట్టుకొని ఈరోజు ఉదయం సోనియాగాంధీ దర్శనానికి వెళ్లారు. తమకు పది జిల్లాల తెలంగాణనే కావాలని అమ్మను కోరారట. అయితే, అధైర్య పడకండీ.. మీ కోరిక నెరవేరుతుందని అమ్మ హామి కూడా ఇచ్చారట. సోనియాతో భేటీ అనంతరం ఇదే విషయాన్ని టీ-కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు మరీ.. !

ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర కేబినేట్ ముందుకు విభజన నివేదిక రానున్న విషయం తెలిసిందే. మరీ.. సోనియా హామి మేరకు కేబినేట్ పది జిల్లాల తెలంగాణను ఓకే చేస్తుందా.. ? లేదా.. రాజకీయ లాభాలు, తదితర ప్రభోల మేరకు రాయల ’టీ’ కన్ ఫమ్ చేస్తుందా.. ? అనేది తెలాల్సివుంది. అమ్మ హామి శిలాశాసనమని టీ-నేతల నమ్మకం.. మరీ నమ్మకం వమ్ముకాబోదుగా.. ? ఏమో చూద్దాం.

Exit mobile version