Site icon TeluguMirchi.com

నేడే అసెంబ్లీకి ’టీ’-బిల్లు… !!

t-bill-in-assemblyవిభజన బిల్లు నేడు (మంగళవారం) అసెంబ్లీకి వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి విదేశీ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో.. టీ-బిల్లును ఏ క్షణమైన కేంద్ర హోంశాఖకు పంపే అవకాశం వున్నట్లు సమాచారం.హోంశాఖ నుంచి ప్రత్యేక దూత ద్వారా రాష్ట్ర గవర్నర్‌ కు చేరుతుంది. ఉభయసభల అభిప్రాయం కోరుతూ బిల్లు ప్రతులను గవర్నర్ అసెంబ్లీ కార్యదర్శి, స్వీకర్
కు పంపిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని నిన్న రాష్ట్రపతితో భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు.

విభజన బిల్లు గత శుక్రవారమే రాష్ట్రపతి వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే.అయితే, కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు వున్నందున బిల్లును రాష్ట్రపతి తిరిగి కేంద్ర హోంశాఖకు పంపించినట్లు తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులను పరిశీలించాక నిన్న మధ్యాహ్నమే మళ్లీ టీ-బిల్లు రాష్ట్రపతి చెంతకు చేరినట్లు సమాచారం. దీంతో… రాష్ట్రపతి టీ-బిల్లును అసెంబ్లీకి పంపించేందుకు గానూ కేంద్ర హోంశాఖకు పంపించనున్నారు. అటుపిమ్మట… రాష్ట్ర గవర్నర్, శాసనసభ కార్యదర్శి.. ద్వారా అసెంబ్లీలో టీ-బిల్లు చర్చకు
రానుంది.

అయితే, బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రపతి అసెంబ్లీకి ఇచ్చే సమయం ఇప్పుడు కీలకం కానుంది. గత అనుభవాలను చూస్తే.. కనీసం పది రోజులైన శాసనసభకు సమయం ఇవ్వాల్సివుంది. అలా.. అయితే, ఈ పార్లమెంట్ సమావేశాల్లో విభజన బిల్లుకు ఆమోదముద్ర పడే అవకాశం లేదు. ఇక టీ-బిల్లు ఆమోదం కోసం మిగిలింది ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయడం ఒక్కటే.

శాసన సభలో, శాసన మండలిల్లో అధిక సభ్యులు సీమాంధ్రకు చెందినవారే..ఈ నేపథ్యంలో టీ-బిల్లుకు ఆమోదం లభించడం కష్టమే. అసెంబ్లీ ఆమోదం అక్కర్లేదు.. అభిప్రాయం చెబితే చాలు. అయినప్పటికినీ.. ఇప్పటికే వెంటిలేటర్ పైనున్న యూపీఏ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో.. టీ-బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం పొందుతుందా… ? లేదా.. ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version