ఉభయ సభల ముందుకు నేడు టీ-బిల్లు!

Telangana bill yet to reach Andhra Pradesh Assemblyరాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు నేడు ఉభయ సభల ముందుకు రానుంది. మొదట స్వీకర్ నాదేండ్ల మనోహర్ రాష్ట్రపతి నుంచి వచ్చిన ముసాయిదా బిల్లు, లేఖపై సభలో ప్రకటన చేయనున్నారు. అనంతరం శాసనసభ కార్యదర్శి రాజా సదారామ్ రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖను చదివి సభ్యులకు వినిపిస్తారు. బిల్లును సభలో పెట్టిన తరవాత బీసీఏ సమావేశం అయ్యే అవకాశం వుంది. అయితే, టీ-బిల్లుపై చర్చించేందుకు బీసీఏ లో ఏకాభిప్రాయం రాకపోవచ్చే పరిస్థితి మాత్రం కనబడటం లేదు.

ఓ వైపు.. ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి విభజన ముసాయిదాపై చర్చింద్దామని ముఖ్యమంత్రితో పాటుగా సీమాంధ్ర ఎమ్మెల్యే అంటుంటే.. మరోవైపు.. తక్షణం చర్చించాల్సిందేనని టీ-నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ముసాయిదాపై చర్చ విషయంలో ఏకాభిప్రాయం రావడం కష్టంగానే కనిపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణ ముసాయిదా బిల్లుపై అధికార ఇరుప్రాంతాల అధికార కాంగ్రెస్ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. విభజన ముసాయిదాపై చర్చ నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు.. పార్టీలుగా కాకుండా.. ప్రాంతాలుగా చీలిపోయే అవకాశం వున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీలో టీ-బిల్లుపై నేడు హాట్ హాట్ చర్చకు తెరలేవనుంది.