నేడు పెద్దల సభకు టీ-బిల్లు!

t-bill4 (1)రాజ్యసభలో నేడు టీ-బిల్లుపై చర్చించనున్నారు. నిజానికి నిన్ననే టీ-బిల్లుపై రాజ్యసభలో చర్చ జరగాల్సి వున్నప్పటికినీ.. భాజాపా సవరణలకు పట్టుపట్టడంతో అది సాధ్యం కాలేదు. భాజాపా 26 సవరణలను సూచించినట్లు తెలుస్తోంది. భాజాపా-కాంగ్రెస్ సీనియర్ నేతల చర్చల అనంతరం వీటి సంఖ్య 6కు చేరినట్లు సమాచారం. అయితే, వీటిలో మూడు సవరణలకు కేంద్రం ఓకే చెప్పింది. ఇక మిగిలిన మూడుపైనే ప్రభుత్వ-ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో.. నేడు రాజ్యసభలో ’టీ’పై చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.