టీ బిల్లు చర్చ ప్రారంభం.. అంతలోనే వాయిదా !

t billఆసెంబ్లీలో ఎట్టకేలకు తెలంగాణ బిల్లుపై చర్చ ఆరంభమైంది. మంత్రి వట్టి వసంతకుమార్ ఈ చర్చను ప్రారంభించారు. సభలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,టిడిపి ఎమ్మెల్యేలు పోడియంలో నినాదాలు చేస్తున్నప్పట్టికీ ప్రభుత్వం పక్షం చర్చను ఆరంభించింది. చర్చను ప్రారంభించిన మంత్రి వట్టి టీ బిల్లు ను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. కేంద్రం పంపిన బిల్లు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రూపొందించినదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల రెండు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశమే కాకుండా.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య విభేదాలు, విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. నీరు, విద్యుత్, వనరులు, ఉద్యోగాలు, నిధులు వంటి అంశాల్లో రెండు ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని, అందుకే తాను ఈ బిల్లును ఏరకంగానూ సమర్థించడం లేదని తెలిపారు. మంత్రి వట్టి వసంత కుమార్ ఉపన్యాసం సాగుతుండగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను వాయిదా వేశారు.