ప్రణబ్ నిర్ణయం పై ఉత్కంఠ !

pranabఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు గడువు పెంచాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను కేంద్ర హోంశాఖ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది. ఈ లేఖను మూడు రోజుల కిందటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ద్వారా కేంద్రానికి చేరింది. అనంతరం దానిని కేంద్ర హోంశాఖ పరిశీలించింది. బిల్లుపై చర్చకు ఇచ్చిన గడువు సరిపోదని, మరో నాలుగు వారాలు పెంచాలని కోరుతూ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు గడువు పొడిగింపు అంశం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు ఉంది. దీంతో ఆయన తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.