Site icon TeluguMirchi.com

’చిన్నమ్మ’.. వచ్చేస్తోంది.. !

susma swaraj

భాజాపా, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణపై ఫోకస్ చేశాయి. ఎలాగైనా.. తెలంగాణలో పాగవేయాలని పట్టుదలతో కనిపిస్తున్నాయి. సహజంగా టీ-లో మొదటి ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేస్తే.. ఆ పార్టీ పునాదులు ఈ ప్రాంతంలో బలంగా వుండే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో.. జాతీయ పార్టీలు తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించాయి.

ఇప్పటికే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన ’అమ్మ’గా తెలంగాణలో సోనియా నిరాజనాలు అందుకోన్నారు. తాజాగా, తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన చిన్నమ్మ వచ్చిస్తోంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో నిర్వహించే సభలో సుష్మాస్వరాజ్ పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు చౌటుప్పుల్ లో సభ జరగనుంది. ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన తరవాత తెలంగాణ సుష్మాస్వరాజ్ పర్యటించడం ఇదే మొదటి సారి.

చౌటుప్పుల్ సభ అనంతరం వరంగల్ జిల్లా జనగాం, మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాదులోని జుమ్మేరాత్ బజారులో ఏర్పాటు చేసిన సభల్లో సుశ్మా పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత సుష్మా స్వరాజ్ తనను మీ ‘చిన్నమ్మ’ గా గుర్తుంచుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.

Exit mobile version