Site icon TeluguMirchi.com

జగన్ బెయిల్ తీర్పు వాయిదా !

jagan-bailఅక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా అధినేత వైఎస్ జగన్ జైలు నుంచి బయటికొస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ నేడు సుప్రీం కోర్టులో వాదించింది. ఈరోజు సుప్రీం జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపింది. జగన్ తరపు న్యాయవాది కూడా తమ వాదనలను బలంగా వినిపించారు. కాగా, న్యాయస్థానం తీర్పును పెండింగ్ లో ఉంచింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు మరో నెలన్నర సమయం పడుతుందని సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న జగన్ కు బెయిలిస్తే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీబీఐ అభిప్రాయపడింది.  ఇప్పటికే, ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి సాక్ష్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారని సీబీఐ పేర్కొంది.

Exit mobile version