సైలెంట్ గా సహకరించండి.. !

cm-kiranరాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. విభజన బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఈ సమయంలో అనవసర రాద్ధాంతం చేయకుండా సైలెంట్ గా సహకరించండి. అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణంలో బిల్లుపై అభిప్రాయాలు వ్యక్తం చేసి కేంద్రానికి పంపండి’’ ఇవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందు ఢిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలు.

టీ-బిల్లు అసెంబ్లీకి చేరిన నేపథ్యంలో.. ఇక్కడ పరిస్థితులను టీ-బిల్లుకు అనుకూలంగా మార్చేందుకు హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ నిన్న సీఎం కిరణ్ తో సమావేశమయి… వారం రోజుల్లో బిల్లుపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో.. మాకు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుందని, టీ-బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు కిరణ్ చెప్పినట్లు సమాచారం.

మొత్తానికి… సీఎం మెత్తబడ్డారని టీ-నేతలు గుసగుసలాడుతున్నారు. సీఎం ఏం చెప్పినా.. ఎన్ని మాటలు మాట్లాడిన దిగ్విజయ్ చెప్పినట్లుగా ఆఖరుకు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటాడన్న మాటలు నిజం కానున్నాయన్న మాట.