Site icon TeluguMirchi.com

ప్రపంచంలోనే మొట్టమొదటి ‘సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్’ ఈవీ బ్యాటరీ, 10 నిమిషాల ఛార్జింగ్ కి 400 కి.మీ!


టెస్లాకు ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఒక చైనీస్ బ్యాటరీ తయారీదారు కేవలం 10 నిమిషాల ఛార్జ్ నుంచి 400 కిలోమీటర్ల పరిధిని అందించగల మొట్టమొదటి సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని విడుదల చేసింది. చైనాకు కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ తన తాజా ఉత్పత్తిని సెంజింగ్ పేరుతో ఆవిష్కరించింది. ఈ బ్యాటరీకి సెంజింగ్ అని పేరు పెట్టారు, ఇది 4సీ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి లిథియం ఐరన్‌ ఫాస్పేట్(LFT) బ్యాటరీ. ఇది 10 నిమిషాల ఛార్జింగ్‌లో 400 కిమీల పరిధిని ఇవ్వడమే కాకుండా, పూర్తి ఛార్జింగ్‌తో, ఈ బ్యాటరీ 700 కిమీల పరిధిని ఇవ్వగలదు. చైనీస్ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని అభివృద్ధి చేసింది.

Exit mobile version