ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం వేరైనా నేపథ్యంలో చాలామంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై విరుచుకపడ్డారు. ఇష్టంవచ్చినట్లు తిట్టడం చేసారు. కానీ ఆ తర్వాత కేసీఆర్ మంచితనం ..రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి ఫిదా అవుతున్నారు. అప్పుడు ద్వేషించినా వారే ఇప్పుడు ప్రేమించడం మొదలు పెట్టారు. తాజాగా సుధీర్ అనే యువకుడు ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
‘సార్.. నేను తెలంగాణకు చెందినవాడిని కాదు. ఒకప్పుడు మిమ్మల్ని, మీ నాన్న కేసీఆర్‌ను తీవ్రంగా ద్వేషించిన వారిలో నేను ఒకడిని. కానీ, ఐదేళ్ల మీ పాలన నేను మీకు పెద్ద అభిమానిగా మారేలా చేసింది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు.. యావత్ దేశం త్వరలోనే మీ నాయకత్వాన్ని పొందుతుందని ఆశిస్తున్నా..’ అంటూ ట్వీట్ చేసాడు.
సుధీర్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘మీ ఫ్రాంక్‌నెస్‌కు, నిష్కల్మష ప్రవర్తనకు ధన్యవాదాలు. మీలో పరివర్తన వచ్చినందుకు, మీ హృదయంలో ద్వేషం స్థానంలో ప్రేమను నింపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ కావడం తో సుధీర్ బాటలోనే మరికొంతమంది కామెంట్స్ పెడుతూ కేసీఆర్ , కేటీఆర్ ల ఫై ప్రేమను కురిపిస్తున్నారు.
Many thanks for your candour Sudheer
Glad you a change of heart and chose love over hate ? https://t.co/TfPD2AlKY1
— KTR (@KTRTRS) April 20, 2020