Site icon TeluguMirchi.com

ఓవైసీ ఇంటిపై రాళ్ళ దాడి

owaisi brothersఢిల్లీలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై బజరంగ్ దళ్, వీహెచ్ పీ కార్యకర్తలు దాడి చేశారు. నివాసంపై రాళ్లు విసరడం వల్ల కిటికీల అద్దాలు పగిలినట్లు సమాచారం. మునుముందు మరిన్ని దాడులు చేస్తామని వీహెచ్ పీ కార్యకర్తలు హెచ్చరించినట్లు సమాచారం. అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగానే తాము దాడి చేశామని కార్యకర్తలు తెలిపారు.

మరోవైపు హైదరాబాద్ లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో సుమారు మూడు గంటల పాటు ఐదుగురు వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అక్బరుద్దీన్ శరీరంలో బుల్లెట్ ఉన్నందున ఎంఆర్ ఐ స్కానింగ్ చేయలేదు. పొత్తికడుపులో నొప్పిగా ఉందని అక్బరుద్దీన్ వైద్యులకు తెలిపారు. పొత్తికడుపు స్కానింగ్ తర్వాతనే వైద్య పరీక్షల నివేదికను వైద్యులు పోలీసులకు అందజేయనున్నారు.

అదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు, ఆపై కేసుల నేపథ్యంలో చోటుచేసుకున్న చిన్నపాటి అల్లర్ల కారణంగా నిర్మల్ లో 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు నిర్మల్ లో144సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఓవైసీల సొంత గడ్డ అయిన హైదరాబాద్ లోని పాత బస్తీలో అల్లర్లు జరగడానికి అవకాశాలు ఉన్నందున పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా ఉద్రిక్తతలు రేగడానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలను ఈపాటికే తమ అదుపులోనికి తీసుకున్నట్టు సమాచారం.

Exit mobile version