Site icon TeluguMirchi.com

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఈ రోజు (శుక్రవారం) ఉదయం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలో వీవీఐపీలను మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటేసి, 156 సీట్లను గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి.

Exit mobile version