శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 TMCలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 188 TMCలకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 880 అడుగులకు చేరుకుంది. కల్వకుర్తి,హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జలాశయానికి జూరాల,సుంకేసుల జలాశయం నుంచి 51వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది.ఈ రోజు APపవర్ హౌస్ కుడిగట్టు,తెలంగాణ ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు