Site icon TeluguMirchi.com

వర్షం ఎఫెక్ట్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తిన అధికారులు

ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల నిజామాబాదు జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరద నీటి వలన, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో ప్రాజెక్టు చెందిన 32 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,32,325 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులుగా ఉన్నది.

Exit mobile version