ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ప్రతి రోజు బయటపడుతూనే ఉన్నాయ్. అయినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం కేంద్రం ప్రకటించిన సడలింపులు ఆధారంగా నడుచుకుంటుంది. ఇప్పటికే వ్యాపారాలు, పరిశ్రమలు, షాపులకు జోన్లవారీగా మార్గదర్శకాలను చేయగా…ఇక ఇప్పుడు ఆలయాల ఫై దృష్టి సారించారు.
తాజాగా కాళహస్తి ఆలయం తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని నిబంధనల్ని పాటిస్తూ భక్తుల్ని ఆలయంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. కరోనా వైరస్ నుండి భక్తులకు పూర్తి రక్షణ కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు.