Site icon TeluguMirchi.com

ప్రత్యేక హోదా: శ్రీ రెడ్డి బట్టలు విప్పాల్సిందేనట

ప్రస్తుతం తెలుగు రాష్ట్ర మీడియా లో హాట్ టాపిక్ గా కొనసాగుతున్న అంశాలు రెండు..ఒకటి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా , మరోటి టాలీవుడ్ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలంటూ అధికార పార్టీ తో సహా మిగతా రాజకీయ పార్టీ లన్ని రోడ్డెక్కి తమ నిరసనలు , ధర్నాలు ,బంద్ లు చేపడుతూ కేంద్ర ఫై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ లో ఆడవారి ఫై జరుగుతున్న లైంగిక వేధింపుల ఫై నటి శ్రీ రెడ్డి తో పాటు మరికొంతమంది నటీమణులు , మహిళా సంఘాలు పోరాటం చేస్తున్నాయి.

వారం క్రితం శ్రీ రెడ్డి మా సభ్యత్వం కోసం ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ద నగ్న ప్రదర్శన చేసి , మా అసోసియేషన్ కిందకు దిగొచ్చేలా చేసిన సంగతి తెల్సిందే. శ్రీ రెడ్డి కాస్త ఇప్పుడు శ్రీ శక్తి గా మారింది. తాజాగా శ్రీ శక్తి మాకు కావాలంటూ కొంతమంది ఆంధ్రప్రదేశ్ యువకులు కోరుకుంటున్నారు. శ్రీ రెడ్డి ఎలాగైతే అర్ద నగ్న ప్రదర్శన చేసి తాను అనుకున్నది సాధించిందో..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు అర్ద నగ్న ప్రదర్శన చేయమని కోరుకుంటున్నారు. ఈ మేరకు శ్రీ రెడ్డి పేస్ బుక్ లో ఈ విధంగా కామెంట్స్ పెడుతున్నారు..

“అవును శ్రీ రెడ్డి నువ్వు నీకు ఫిలిం అవకాశాలు ఇవ్వట్లేదు మా మెంబర్ షిప్ ఇవ్వట్లేదు అని బట్టలు విప్పుకొని ధర్నా చేసావు, మా ని సానుకూలం గా కొన్ని చేశారు…దయచేసి నువ్వు నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా ఒకసారి మన రాష్ట్రము కోసం ఆలా చైయావా స్పెషల్ స్టేటస్ వస్తుంది. ఆలా చేస్తే నీకు టెంపుల్స్ కడుతారు ఏపీ ప్రజలు” అంటూ కామెంట్స్ పెట్టారు.

మరి దీనికి శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version