లాక్‌డౌన్ కారణంతో ఏపీలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. రాష్ట్రంలో నాటు సారా తయారీ మొదలైంది. . ఈ నేపధ్యంలో సారా తయారీపై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని, అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు నిద్రపోతున్నారా అంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాటు సారా తయారీ విచ్చలవిడిగా సాగుతోందని కొందరు తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారని అన్నారు. నాటుసారా మాఫియాతో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారని ,ఈ ముఠాలు సమాజాన్ని కంట్రోల్ చేసే స్థితికి చేరుకుంటున్నాయని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా నిషేధిత గుట్కాలు దొరుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి నాటుసారా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.
తమ్మినేని వ్యాఖ్యలు సహజంగా.. కలకలం రేపుతాయి. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి.. ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని వారు మండిపడతారు. ఈ సారి సెగ మాత్రం.. సొంత పార్టీలోనే తగులుతోంది. నాటు సారాతో…బాగా సంపాదించేస్తున్న వారెవరి గురించో.. సీతారాంకు తెలిసి ఉంటుందని.. అందుకే ఆయనఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమౌతుంది