మహిళా పోలీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను విడుదల చేసింది. ఏపీ మహిళా పోలీస్ సబార్డినేట్ రూల్స్ 2021కి ఆమోదం తెలిపింది. మహిళా పోలీసులను ఐదు కేటగిరీలుగా విభజించారు. ప్రారంభంలో మహిళా పోలీసులుగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత సీనియర్ మహిళా పోలీస్, అసిస్టెంట్ సబ్‌ఇన్స్‌పెక్టర్, సబ్‌ఇన్స్‌పెక్టర్, ఇన్స్‌పెక్టర్ స్థాయి వరకూ ప్రమోషన్లకు అవకాశం కల్పించారు.
కేటగిరీలలో పదోన్నతులు.
- మహిళా పోలీస్ గా కనీసం ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సీనియర్ మహిళా పోలీస్ కు అర్హత సాధిస్తారు
- సీనియర్ మహిళా పోలీస్ గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినట్లయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) కు అర్హత సాధిస్తారు.
3.అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినచో సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్)కు అర్హత సాధిస్తారు.
- సబ్ ఇన్స్పెక్టర్( మహిళా పోలీస్)గా కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినతో ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) నాన్ గెజిటెడ్ కు అర్హత సాధిస్తారు.