Site icon TeluguMirchi.com

వ్యయవసాయానికి ప్రత్యేక బడ్జెట్

cbn

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటి చేసేవరకు విశ్రమించేది లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు వందశాతం న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాళీల భర్తీకి ప్రణాళిక రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సహజవనరులన్నీ ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతామని బాబు తెలిపారు.

Exit mobile version