ఎస్టీ, ఎస్సీల బిల్లుపై ఎస్పీ ఆందోళన

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ఉభయ సభల్లోనూ సమాజ్ వాది పార్టీ ఆందోళన నిర్వహించింది. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే బిల్లుకు వ్యతిరేకంగా ఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగి సభా కార్యక్రమాలు డ్డుకున్నారు. ఈరోజు ఉభయ సభల్లోనూ దీనికి సంబంధించి ఓటింగ్ జరగనుంది. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్పీ నిరసనల మధ్య లోక్ సభ ఈ ఉదయం రెండు సార్లు వాయిదా పడింది. దీంతో మొదట సభను 11-30కు స్పీకర్ మీరాకుమార్ వాయిదా వేశారు. వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమయినా పరిస్థితితో ఎటువంటి మార్పు రాకపోవడంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై ఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఛైర్మన్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను ఛైర్మన్ 2 గంటలకు వాయిదా వేశారు.