Site icon TeluguMirchi.com

మోడీ కి సోనియా ఎలాంటి సలహాలు ఇచ్చిందో తెలుసా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బుసలు కొడుతుంది..ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడాలు లేకుండా అన్ని జిల్లాలో ఈ మహమ్మారి పెరుగుతుండడం తో కేంద్రానికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించప్పటికీ ఈ వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమం లో ఈ కరోనా కట్టడి చేయాలంటే ఇవి పాటించాలసిందే అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.

కరోనా పోరాటానికి సలహాలు, సూచనలు ఇవ్వమని ప్రధాని టెలీఫోన్ ద్వారా కోరడంతో.. సోనియా ఐదు సలహాలతో కూడిన లేఖను మోదీకి రాశారు. వచ్చే రెండేళ్లపాటు మీడియా (టీవీ, ప్రింట్, ఆన్‌లైన్)కు ప్రభుత్వం రెండేళ్లపాటు ప్రకటనలు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించాలని సోనియా సూచించారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును రద్దుచేస్తే రూ.20000 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు. విదేశీ అధికారిక పర్యటనలను వాయిదా వేయాలని కోరారు.

పార్లమెంటు సభ్యుల జీతాలు 30శాతం తగ్గించాలని కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. కోవిడ్‌-19పై పోరాటంలో ప్రతి గంట ముఖ్యమే కాబట్టి ఇతర రంగాల నుంచి అత్యవసరమైన వాటికి నిధులను మళ్లించటం అవసరం అని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రభుత్వ పరిధిలోని ఏ సంస్థకూడా కొంతకాలం ప్రచారం కోసం నిధులు ఖర్చు చేయకుండా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న నిధులతో హాస్పిటల్‌ మౌలికవసతులు, రోగ నిర్ధారణ వసతులను మెరుగుపర్చాలని లేఖలో తెలిపారు.

Exit mobile version