Site icon TeluguMirchi.com

సోనియా ఆరోగ్యం బాగానే వుంది

SoniaGandhi_PTI_Rahul_FoodBillఛాతీ నొప్పి, వైరల్ ఫీవర్ తో నిన్న రాత్రి అత్యవసరంగా ఎయిమ్స్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్యం కుదుటపడినట్లు తెలుస్తోంది.సోనియాగాంధీకి వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత ఆమె ఆరోగ్య స్థితి సాధారణంగానే ఉందని నిర్ధారించుకుని ఈ తెల్లవారుజామున డిశ్చార్జ్ చేశారు. ఈరోజు ఉదయం ఆమె ఇంటికి చేరుకున్నారు. సోనియా ఆరోగ్యం బాగానే ఉందని, జలుబుతో ఇబ్బంది పడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ తెలిపారు. కాగా, నిన్నరాత్రి ఆహార భద్రత బిల్లుపై సవరణలు జరుగుతుండగానే సోనియా గాంధీని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

Exit mobile version