కోర్టు ను ఆశ్రయించిన సోనియా !

sonia1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు వ్యవహారంలో తనపై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేయాలంటూ సోనియాగాంధీ అమెరికా కోర్టును ఆశ్రయించనున్నారు. ఈమేరకు ఆమె తరుపు న్యాయవాది రవీ బాత్రా గురువారం న్యూయార్క్ ఈస్ట్రన్ జిల్లా కోర్టులో 85 పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ వ్యవహారంలో మరిన్ని కేసులు తనపై దాఖలు కాకుండా కట్టడి చేయాలనీ న్యాయ స్థానానికి ఆమె విజ్ఞప్తి చేయనున్నారు. ‘ఎస్ఎఫ్ జే దాఖలు చేసిన వ్యాజ్యం రద్దు కోరుతూ సోనియా గాంధీ ఫిబ్రవరి 7న కోర్టును ఆశ్రయిస్తారు’ అని రవి బాత్రా కోర్టుకు తెలిపారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులకు సోనియా బాసటగా నిలిచారంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ కేసు దాఖలు చేసింది.