Site icon TeluguMirchi.com

పావులు కదుపుతున్న సోనియా గాంధీ

వచ్చే సంవత్సరం జరుగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం తధ్యం అనేది అందరి మాట. 2014 ఎన్నికల్లో సొంతంగా బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో పార్లమెంటు స్థానాలు దక్కాయి. వచ్చే సంవత్సరం జరుగబోతున్న ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో వస్తాయని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. కాని రాజకీయ విశ్లేషకులు మాత్రం అంచనాలు తారు మారు అయ్యే అవకాశాలున్నాయని అంటూ ఉన్నారు. ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంను దక్కించుకుంటే దక్కించుకోవచ్చు, కాని గతంలో వచ్చినంత మెజార్టీ మాత్రం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు.

బీజేపీపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి పావులు కదుపుతున్నారు. బీజేపీపై వ్యతిరేకంగా యుద్దం చేస్తున్న పార్టీలను కలుపుకు పోవాలని కాంగ్రెస్‌ అధినేత్రి భావిస్తున్నారు. అందుకే తాజాగా తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీతో సోనియా చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో యూపీఏ కూటమికి గౌరవ ప్రధమైన సీట్లు దక్కే అవకాశం ఉందని, గట్టిగా ప్రయత్నిస్తే రాహుల్‌ గాంధీ పీఎం కూడా అవ్వొచ్చు అని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

Exit mobile version