Site icon TeluguMirchi.com

బరేలి ప్రజలే గెలిపిస్తారు

Sonia-Gandi
ప్రేమాభిమానాలతో తాను రాయ్ బరేలిని దత్తత తీసుకున్నానని… దీనికి ప్రతిఫలంగా అక్కడి ప్రజలు మరోసారి తనకు ఘనవిజయాన్ని అందిస్తారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయ్ బరేలి లోక్ సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సోనియా మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడానికి ముందు పురసత్ గంజ్ విమానాశ్రయంలో సోనియాకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

ఇక 1960 నుంచి ప్రతి ఎన్నికల్లో నెహ్రూ, గాంధీల కుటుంబం రాయ్ బరేలి నియోజకవర్గంలో విజయం సాధిస్తోంది. తన భర్త ఫిరోజ్ గాంధీ మరణం తర్వాత తొలిసారి ఇందిరాగాంధీ ఈ నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. సోనియాగాంధీ మూడు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. ఆస్తుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన ఆమె… 2004 ఎన్నికల్లో అమేథి నుంచి రాయ్ బరేలికి మారారు. గతంలో బళ్లారి నియోజకవర్గంలో సుష్మాస్వరాజ్ ను సోనియాగాంధీ ఓడించిన సంగతి తెలిసిందే.

Exit mobile version