జగన్ ఈ మధ్య పెళ్లిళ్ల అంశంపై మాట్లాడుతున్నారు. మొన్న ఏమో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ ను విమర్శించారు. ఇప్పుడేమో టీడీపీ ఫై పెళ్లిళ్ల భాష వాడి మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా జగన్ గారు మీ తండ్రి గారి దగ్గర నుంచి మీ వరకు మీరు చెప్పే భాషలో ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో తెలుసా ? 2004 లో మీ తండ్రి గారు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరియు తెరాస, అదీకాకుండా సమాజ్ వాది పార్టీ. అక్కడ నుంచి ఇప్పటి వరకు వైసీపీ. అంటే అక్కడికే ఆరు పెళ్లిళ్లు అయిపోయాయి.
ఇప్పుడేమో కొత్తగా మీ పార్టీ నాయకుడు వరప్రసాద్ గారు జనసేనతో పెళ్లి ఖాయం అయిపోయింది అని చెపుతున్నాడు.అంటే ఇప్పటికి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో మిరే లెక్కచెప్పండి.ఇవి అన్ని కాకుండా మీ కేసులు కోసం మోడీతో అక్రమ సంబంధం, మోడీ గారితో 45 నిమిషాల ఆంతరంగిక సమావేశం అవ్వడం. మరి మీరు లోపల ఏం చర్చించుకొన్నారో , ఏం నిర్ణయం తీసుకున్నారో ప్రపంచానికి అయితే తెలియదు. కనీసం మీ సాక్షి ఛానల్ మరియు పత్రికకు కూడా తెలియదు అని వైసీపీ అధినేత జగన్ ఫై మంత్రి సోమిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.