Site icon TeluguMirchi.com

సోష‌ల్ “లీడ‌ర్‌”…

ncbn
టెక్నాల‌జీని ప్ర‌మోట్ చేయ‌డంలోనే కాదు. వాడ‌టంలోనూ ముందంజ‌లో ఉన్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు…ఇ-ఆఫీస్,ఇ-కేబినెట్,ఇలా అన్నీఆన్ లైన్ ప‌రం చేసిన సీఎం చంద్ర‌బాబు…ప్ర‌భుత్వ పధ‌కాల పై ఫీడ్‌బ్యాక్‌ కోసం కూడా టెక్నాల‌జీని అదే ర‌కంగా వాడుకుంటున్నారు. ఫేస్ బుక్,ట్విట్ట‌ర్ ల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల స్పంద‌న‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫేస్ బుక్ లో సీఎం చంద్ర‌బాబుకు కార్య‌క్ర‌మాల‌కు ఓ ప్ర‌త్యేక పేజీని అందుబాటులోకి తెచ్చింది ముఖ్య‌మంత్రి కార్యాల‌యం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంఓ పేరుతో ఉన్న ఈ పేజీకి ఇటీవ‌ల రోజుల్లో భారీగా స్పంద‌న వ స్తుంది. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను,చంద్ర‌బాబు సందేశాల‌ను ఈ పేజీద్వారా మినిట్ టూ మినిట్ అప్ డేట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా యువ‌త‌.. దేశ విదేశాల్లోని తెలుగు ప్ర‌జ‌లు ఈ సోష‌ల్ మీడియాలో సీయం పేజికి ఎక్కువ‌గా ఎట్రాక్ట్ అవుతున్నారు. అమెరికా..యూరప్ తో పాటుగా ఏపి తో స‌హా ఇత‌ర రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా ఇందులో భాగ‌స్వాములు అవుతున్నారు.

ఫేస్ బుక్ లో ఏరోజు ఏయే అంశాల‌పై పోస్ట్ చేయాల‌నే దానిపై రోజూ ఉద‌యం సీఎం చంద్ర‌బాబు త‌న సిబ్బందికి సూచిస్తారు. దీనికోసం ప్ర‌త్యేకంగా ఓ టీం సీఎం కార్యాల‌యంలో ప‌నిచేస్తుంది. ఫేస్ బుక్ పేజీలో వ‌చ్చే కామెంట్స్…సూచ‌నల‌ను వెంట‌నే సీఎం దృష్టికి తీసుకెళ్ల‌డం …వాటిపై చ‌ర్చించి ప‌రిష్కారం చూపించే బాధ్య‌త‌ను కూడా ఈ టీం చూసుకుంటోంది. అయితే ఒక్కో పోస్ట్ కు ఒక్కో ర‌కంగా వేల సంఖ్య‌లో లైక్ లు వ‌స్తున్నాయి…ఈ లైక్ లు కృత్రిమం కాదు. సీఎం ఫేస్ బుక్ పేజీని రెగ్యుల‌ర్ గా 36వేల‌మంది ఫాలో అవుతున్నారు. హుదుధ్,పుష్క‌రాల స‌మ‌యంలో ఫేస్ బుక్ ద్వారా చేసిన ప్ర‌చారానికి ల‌క్ష‌లాది లైక్ లు వ‌చ్చాయి. లైక్‌లు..పోస్టింగ్‌లు ఎప్ప‌టిక‌ప్పుడు క్రోడీక‌రించి..వాటికి స‌మాధానాలు సైతం ఇస్తున్నారు. అదే విధంగా..గూగుల్ హ్యంగ‌వుట్ ద్వారా ప‌లువ‌రితో ట‌చ్‌లోకి వ‌స్తున్నారు సీయం చంద్ర‌బాబు. ఇదే త‌ర‌హాలో సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ద్వారా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చేలా రెగ్యుల‌ర్ కార్యక్ర‌మం సిద్దం చేస్తున్నారు సీయంఓ సిబ్బంది.

త‌మ‌ది చెప్పేది కాదు…వినే ప్ర‌భుత్వం అని ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్నారు సీయం చంద్ర‌బాబు. స్మార్ట్ విలేజ్..స్మార్ట్ వార్డు కార్య‌క్ర‌మం పైనా ఏపి సీ యం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పంద‌న క‌నిపిస్తోంది. గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మయంలోనూ చంద్ర‌బాబు సాంకేతిక ప‌రిజ్ఞానం కు ప్రాధాన్య‌త ఇచ్చేవారు. ఇప్పుడు..స‌మ‌యం దొరికినప్పుడ‌ల్లా..సోష‌ల్ మీడియా లో వ‌స్తున్న స్పంద‌న‌ను స్వ‌యంగా ప‌రిశీలిస్తున్నారు. టెక్నాల‌జిని బాగా ఉప‌యోగించుకొనే సీయం..ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌కున్న ప్ర‌తిష్ఠ మ‌రింత పెరిగేలా సోష‌ల్ మీడియాలో స్పంద‌న క‌నిపిస్తోంది. ఇక‌… నూత‌న రాజ‌ధాని అంశంలో సైతం సూచ‌న‌లు…స‌ల‌హాలు తీసుకోవ‌టంతో పాటుగా గుగూల్ హ్యాంగ‌వుట్ ద్వారా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల ని..వారి సూచ‌న‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని..అదే స‌మ‌యంలో వారి అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని సీయం యోచిస్తున్నారు. త్వ‌ర‌లోనే సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కానున్నారు సీయం చంద్ర‌బాబు.

ఫేస్ బుక్ లోనే కాదు ట్విట్ట‌ర్ లో సైతం ఏపి సీఎంఓ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అంత‌ర్జాతీయంగా పేరున్న సీయం చంద్ర‌బాబు నాయుడు.. టెక్నాల‌జీలో…కొత్త ఆలోచ‌న‌ల‌తో..ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ..సోష‌ల్ మీడియాలో లీడ‌ర్ గా నిలుస్తున్నారు…

సీయంఓ కు ట్వ‌ట్ట‌ర్‌లో 39,511 మంది ఫాలోయ‌ర్స్..
ఫేస్‌బుక్‌లో 32,153 లైక్స్‌…
పేజ్‌రీచ్‌…86,824 మంది..
చంద్ర‌బాబు నాయుడు వ్య‌క్తిగ‌త ఫేస్‌బుక్ లో..4,60,918 లైక్స్‌..
వ్య‌క్తిగ‌త హోదాలో ట్విట్ట‌ర్‌లో ..ఎనిమిది ల‌క్ష‌ల తొమ్మ‌ది వేల 48 మంది ఫాలోయ‌ర్స్.
.

Exit mobile version