Site icon TeluguMirchi.com

స్మార్ట్ ఇండియా హాకథన్ 2022 గ్రాండ్ ఫినాలే లో ప్రసంగించనున్న ప్రధాని మోడీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 25 వ తేదీ నాడు రాత్రి 8 గంటల కు ‘స్మార్ట్ ఇండియా హాకథన్ 2022’ యొక్క గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

దేశం లో ప్రత్యేకించి యువతీ యువకుల లో నూతన ఆవిష్కరణల కు సంబంధించినటువంటి స్ఫూరిని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నిరంతరం ప్రయాస లు చేస్తూ వస్తున్నారు. ఇదే దార్శనికత ను అనుసరిస్తూ, స్మార్ట్ ఇండియా హాకథన్ (ఎస్ఐహెచ్) ను 2017 వ సంవత్సరం లో మొదలు పెట్టడమైంది. ఎస్ఐహెచ్ అనేది సమాజం యొక్క, సంస్థల యొక్క మరియు ప్రభుత్వం యొక్క అనేక చిక్కు సమస్యల ను పరిష్కరించడాని కి విద్యార్థుల కు ఒక వేదిక ను సమకూర్చేటటువంటి ఒక దేశవ్యాప్త కార్యక్రమం గా ఉన్నది. ఇది విద్యార్థుల లో ఉత్పత్తి పరమైన నూతన ఆవిష్కరణ, సమస్య ను పరిష్కరించడం లతో పాటు గా అంతవరకు అవలంబిస్తున్న ఆలోచన విధానాని కి భిన్నం గా సరికొత్త ఆలోచన లను చేసే సంప్రదాయాన్ని నెలకొల్పాలని ధ్యేయం గా పెట్టుకొంది.

ఈ గ్రాండ్ ఫినాలే లో 75 కేంద్రాల కు చెందిన 15,000 కు పైగా విద్యార్థులుపాలుపంచుకోనున్నారు. 2900 కు పైగా పాఠశాల లు మరియు 2200 ఉన్నత విద్య సంస్థల కు చెందినవిద్యార్థులు ఈ ఫినాలే లో 53 కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అందిన 476 సమస్యల ను పరిష్కారాల ను కనుగొనేందుకుకృషి చేస్తారు. ఈ సంవత్సరం లో, పాఠశాల విద్యార్థుల మనస్తత్వాన్ని అభివృద్ధి పరచడం తో పాటు నూతన ఆవిష్కరణల సంస్కృతి ని తీర్చిదిద్దడం కోసమని పాఠశాల విద్యార్థుల కు ఒక ప్రయోగాత్మక కార్యక్రమమా అన్నట్లు గా ‘స్మార్ట్ ఇండియా హాకథన్-జూనియర్’ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

Exit mobile version