చిన్న కాంట్రాక్టర్ల లను… క్లాస్ వన్ కాంట్రాక్టర్లుగా మారుస్తానన్న గతంలో హామీనిచ్చారు కెసిఆర్. ఇప్పుడు సీఎం తమ ఊసే ఎత్తడం లేదని ఆరోపిస్తున్నారు చిన్న కాంట్రాక్టర్లు. ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన పనులకు బిల్లును సైతం విడుదల కాకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. బిల్లులు కోసం ఏడాది కాలంగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు చిన్న కాంట్రాక్టర్లు.
కొత్త రాష్ట్రంలో ప్రతీది సరికొత్తగా ఉండాలన్న యోచనతో పని చేసుకుంటూ వస్తున్నారు సీఎం కేసీఆర్. దాంతోటి కొన్ని పనులు ముందుకుసాగడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది నిధులు… అందుకు సంబంధించిన ఫైల్స్ క్లియర్ సకాలంలో జరగడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 2013 నుంచి మార్చి 2014 వరకు 500 కోట్లను నియోజవర్గాల స్పెషల్ డెవలప్ మెంట్ కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయంలో ఈ నిధులను కేటాయించారు. అయితే ఈ 500 కోట్లలో తెలంగాణ వాటగా 200 కోట్లు వచ్చాయి. ఆ నిధులకు అనుగుణంగా రాష్ట వ్యాప్తంగా చిన్నా చితకా కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయిలో పనులు చేశారు. ప్రభుత్వం నుంచి నిదులు విడుదల కాకున్నా…భవిష్యత్తులో వస్తాయన్న ధీమాతో పనులను దాదాపు పూర్తి చేశారు. అయితే రాష్ట విభజన జరగటంతో వారికి నిధులు విడుదల కాలేదు.
ఈ నిధులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఏడాది కాలంగా ఏ కారణాల వల్లో తెలియదు కానీ పెండింగ్ బిల్లుల ఫైల్ ను యాధా తథ స్తితిలోనే ఉంచాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. స్పెషల్ డెవలప్ మెంట్ తాలూకు పనులకు సంబంధించి ఏడాది క్రితం ప్రత్యేక ఫైల్ ను తయారు చేసి సీఎం పేషి కి పంపారు ఉన్నతాధికారులు. అయితే సంబంధిత ఫైలు సీఎం పేషికి వెళ్లింది కానీ ఇప్పటి వరకు బయటకు మాత్రం రాలేదు.
సీఎం వద్దే ఫైలు పెండింగ్ లో ఉండటంతో..ఈ నిధులపై ఆశలు పెట్టుకుని అక్టోబర్ 2013 నుంచి మార్చి 2014 వరకు నియోజకవర్గ స్థాయిల్లో పాఠశాలలో మరుగుదోడ్లు, కల్వర్టులు, ప్రహారి గోడలు, మురికి కాలువల నిర్మాణం తదితర పనులను చేపట్టారు. దీంతో ఆ పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లు నిధులు మంజూరు కాకపోవడంతో లబోదిబో మంటున్నారు. తాము పెద్ద పెద్ద కాంట్రాక్టర్లం కామని ..ప్రభుత్వ పనులు చేసి 5, 10 లక్షలు బిల్లులు పెట్టుకునే వాళ్లమని వాపోతున్నారు. ప్రభుత్వం తమ బిల్లులను చెల్లించకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేక.. .తమ చేతి చమురు వదిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు మార్లు ఉన్నతాదికారుల దృస్టికి తీసుకెల్లినా..ఫైల్ సీఎం పేషీలో ఉండటంతో తామెం చేయలేమిన చేతులెత్తేస్తున్నారు అధికారులు.
ఇప్పటికైనా సీఎం కెసిఆర్ స్పందించి తమ బిల్లులకు సంబంధించిన ఫైలును వెంటనే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు. లేకపోతే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోతున్నారు. .