దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి రాకెట్‌ను ప్రయోగించనుండగా శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రేపు ఉదయం 11గంటల 30 నిమిషాలకు విక్రమ్-ఎస్ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. దీన్ని హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసింది. ఈ నెల 12నే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించక శాస్త్రవేత్తలు వాయిదా వేశారు.