Site icon TeluguMirchi.com

విజయవాడలో సీతమ్మ వారి విగ్రహం ధ్వసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంజరుగుతుందో అర్ధం కావడం లేదు. వరుసగా హిందూ దేవాలయాల్లో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రం లో అనేక చోట్లా హిందూ దేవాలయాల్లో విహగ్రహాలు ధ్వసం అవుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం ఘటన మరువక ముందే రాజమండ్రిలో సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహానికి రెండు చేతులను దుండగులు విరగ్గొట్టారు.

తాజాగా విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సీతారామమందిరంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ పనిచేశారా? లేక కిందపడి విగ్రహం పగిలిపోయిదా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మట్టితో తయారుచేసిన విగ్రహమని, ఎలుకలు లేదా గాలికి కిందపడి ధ్వంసమై ఉంటుందని సీఐ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version