విప్ ను ధిక్కరించిన సీమాంధ్ర ఎంపీలు !

seemandra mpsసీమాంధ్ర ఎంపీలు దూకుడు పెంచారు. విభజన విషయంలో.. అధిష్టానంతో ఢీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. తాడోపేడో తేల్చుకునే దిశగా సీమాంధ్ర ఎంపీలు పార్టీ విప్ ను ధిక్కరించారు. పార్లమెంట్ సమావేశాల నుండి ఎంపీలు బయటకు వచ్చారు. అంతేకాకుండా… ఆంటోని కమిటీని కూడా కలవకూడదని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ’ఆహార భద్రత బిల్లు’ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో… కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ఎంపీలకు విప్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపీల ధిక్కరణ నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్టానం వారితో చర్చంచే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆహార భద్రత బిల్లులో కొన్ని సవరణలు చేస్తే.. ఓటింగ్ లో పాల్గొనడానికి రెడీ అని కొందరు సీమాంధ్ర ఎంపీలు అంటున్నట్లు సమాచారం.