Site icon TeluguMirchi.com

ముషారఫ్ పై ‘బుల్లెట్’ కాదు.. ‘బూటు’ దాడి !

musharrafపాకిస్తాన్ తాలిబాన్లు ముందుగా హెచ్చరించినట్లుగానే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే తాలిబన్లతో పాటు పాకిస్థాన్ లోని పలు ప్రజా సంఘాలు కూడా ముషారఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో.. తాలిబన్ల బుల్లెట్ కంటే ముందుగా ప్రజాసంఘాల ’బూట్’ దాడి జరిగింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ముషారఫ్ కేసు నిమిత్తం సింధ్ హైకోర్టుకు హాజరయిన సమయంలో.. గుర్తు తెలియని ఆగంతకుడు ఆయనపై కాలు బూటు విసిరారు. అగంతకుడు ముషారఫ్ లక్ష్యంగా బూటు విసిరినా.. కట్టుదిట్టమైన భద్రత, భారీజన సమూహం కారణంగా తృటిలో.. లక్ష్యం తప్పి ప్రక్కన పడినట్లు తెలుస్తోంది. కాగా, ముషారఫ్ ను కోర్టులో హాజరుపర్చుతున్న సమయంలో పలువురు ఆందోళనకారులు అతనికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. ముషారఫ్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. దివంగత పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్య కేసుకు సంబంధించి గతంలో బెయిల్ మంజూరు చేసిన సింధ్ హైకోర్టుకు తాజాగా బెయిల్ ను మరో పదిహేను రోజులు పొడగించినట్లు తెలుస్తోంది. అయితే అయిదు సంవత్సరాలుగా మాతృదేశానికి దూరంగా ఉన్న ఈ పాకిస్థాన్ మాజీ ప్రధాని గత వారం తిరిగి స్వదేశంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Exit mobile version