మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం

sivaraj singh2మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకరం చేశారు. భోపాల్ జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి, భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, అగ్రనేత అద్వానీతో పాటుగా పలువురు భాజాపా నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ భాధ్యతలు స్వీకరించడం వరుసగా ఇది మూడోసారి. కాగా, ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ నేతృత్వంలోని భాజాపా భారీ అత్యధిక స్థానాలను గెలుపొందిన విషయం తెలిసిందే.

sivaraj singh1