Site icon TeluguMirchi.com

షిండే కు ‘నిర్భయ2’ సెగ !

shinde-delhi gang rapeఐదేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనతో అట్టుడుకుతోంది. ఐదేళ్ళ చిన్నారిపై అత్యంత దారుణమైన రీతిలో అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నేడు దేశ రాజధానిలో ఆందోళనలు మిన్నంటాయి. గత సంవత్సరం డిసెంబర్ లో నిర్భయ ఘటన మరవకముందే.. దేశ రాజధానిలో నిర్భయ2 చోటుచేసుకోవడంతో.. ప్రజలు ఆగ్రహంతో.. ఊగిపోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆందోళనకారులు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంటిని ముట్టడించారు. అంతేగాకుండా.. రాష్ట్రపతి భవన్, పోలీస్ కమిషనరేట్ , ఎయిమ్స్, ప్రాంతాల్లో భారీగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆందోళన కారుల ఆందోళనలపై హోం మంత్రి షిండే స్పందించారు. విచారణ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, చిన్నారిపై వికృత చేష్టలకు పాల్పడిన నిందితుడిని నేడు బీహార్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version