గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చెరువులు , కుంటలు , వాగులు , వంకలు ఇలా అన్ని పొంగిపొర్లుతున్నాయి. ఈ భారీ వర్షాలతో కృష్ణా నది ఉప్పొంగిపోతుంది. ఈ వరద తాకిడికి హీరో శర్వానంద్ తాతయ్య డాక్టర్ మైనేని హరిప్రసాద్కి చెందిన ఇల్లు కొట్టుకుపోయింది.
అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా హరిప్రసాద్ కు మంచి పేరుంది. ఇక ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో శర్వానంద్ ఇదే భవనంలో గడిపేవారు. అయితే గతేడాది సంభవించిన వరదల్లో శర్వానంద్ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.