Site icon TeluguMirchi.com

హైటెక్ సిటీ వెళ్లే వాహనదారులకు శుభవార్త, రేపు ప్రారంభం కానున్న షేక్ పేట్ ఫ్లైఓవర్

నగర ప్రజలకు మెరుగైన మౌలిక  సదుపాయాల కల్పన  నేపథ్యంలో నగర ప్రజలకు సిగ్నల్ ఫ్రీ నగరంగా ప్రసిద్ధి పొందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (SRDP) పథకంలో భాగంగా చేపట్టిన మరో ప్రాజెక్టు నగర ప్రజలకు  అందుబాటులోకి  రానున్నది. రూ. 333.55కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నగరంలో అతిపెద్ద షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను నూతన సంవత్సర కానుకగా శనివారం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు  కె.తారకరామారావు అంకితం చేయనున్నారు.

 హైదరాబాద్ నగరంలో SRDP ద్వారా చేపట్టిన  ఫ్లై ఓవర్ లోషేక్ పేట్ ఫ్లైఓవర్    అత్యంత  పొడవైనది  ఆరాంఘర్ నుండి ఎల్.బి నగర్ వెళ్లే రహదారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (మిధాని -ఓవైసీ హాస్పిటల్ )  మల్టీలెవల్  ఫ్లైఓవర్ జంక్షన్ ను మంత్రి కే టి ఆర్  ఇటీవలనే  ప్రారంభించారు.   ఎస్.ఆర్.డి.పి పథకం ద్వారా మొత్తం రూ. 8 వేలకోట్ల అంచనా వ్యయంతో 48 వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో సుమారు రెండు వేల కోట్ల విలువ గల ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్.ఓ.బి లు, ఆర్.యు.బి లు తదితర 24 పనులు పూర్తయ్యాయి.

సుమారు రూ. 6 వేలకోట్ల రూపాయల విలువ గల మరో 24 పనులు వివిధ ప్రగతి దశలో కలవు. ఆర్ అండ్ బి జాతీయ రహదారుల శాఖలతో సమన్వయం చేస్తూ జిహెచ్ఎంసి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది.  ఈ నేపథ్యంలో షేక్ పేట్ ఫ్లైఓవర్  రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల మేరకు చేపట్టారు  ఖైరతాబాద్ జోన్  సర్కిల్ 18 నుండి  శేరిలింగంపల్లి జోన్ మల్కమ్ చెరువు  వరకు 6 లైన్లతో  ఫ్లైఓవర్ ను నిర్మించారు. గతంలో 4  జంక్షన్లు ఓయూ కాలనీ  ఫిల్మ్ నగర్, 7 టూమ్స్   విస్పెర్ వ్యాలీ జంక్షన్లలో  మేజర్  కారిడార్ గుండా ప్రతి రోజూ  4 లక్షల  వాహనాలు రాకపోకలు సాగుతాయి.  లక్డికాపూల్ నుండి మెహిదీపట్నం, టోలిచౌకి  మీదుగా గచ్చిబౌలి వరకు 11 కిలోమీటర్ల మేజర్ ట్రాఫిక్ కారిడార్ లో మెరుగైన రవాణా సౌకర్యం తో పాటుగా రేతిబౌలి నుండి ఓ.ఆర్.ఆర్ గచ్చిబౌలి వరకు ఫ్లైఓవర్  కలుపుతుంది. అంతేకాకుండా ఈ  ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుండి .జె.ఎన్.టి.యు జంక్షన్ వరకు కలుపుతూ 17 కిలోమీటర్ల మేర ఎలాంటి ట్రాఫిక్  సమస్య లేకుండా చేస్తుంది.

Exit mobile version