కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అయ్యప్ప దర్శనానికి భక్తులు బారులు తీరారు. అయ్యప్పమాలను ధరించిన స్వాములు ఇరుముడితో ఆలయానికి చేరుకుని అయ్యప్పను దర్శించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేసింది. ముఖ్యంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత జనవరి 19వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు.