కింది స్థాయి నేతలే కాదు…. పీసీసీలో కీలక బాద్యతల్లోఉన్న నేత కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయడం విశేషం. నాచిన్నప్పటి నుంచి కాంగ్రెస్ లో ఈనాయకులనే చూస్తున్నా… నేను కీలక బాధ్యతల్లోకి వచ్చినా ఈ నాయకులే కనిపిస్తున్నారు. ఈ పద్దతి ఎప్పుడుమారుతుందా? అనుకున్నా… డిఎస్ తనంతట తానే ఆ అవకాశం పార్టీకి ఇచ్చారని వ్యాఖ్యానించారు సదరు నేత. అంతేనా…. సీనియర్ల కారణంగా ఏళ్ల తరబడి పార్టీనినమ్ముకునితిరుగుతున్న నాయకులకుఅవకాశాల్లేకుండా పోతున్నాయి. పార్టీ కోసం పని చేయడం తప్ప పదవులు దక్కని నేతలజాబితా కాంగ్రెస్ లో చాలానే ఉంది. మూడుసార్లువరుసగా ఎన్నికల్లోఓడిన డిఎస్ కు ఎమ్మెల్సీ సీటుఇచ్చారు. అదే డిఎస్ లేకుంటే ఆ ఛాన్స్ ఇంకొకరికి దక్కేది అని నేతలంటున్నారు..
మొన్నటికి మొన్న అంబర్ పేట నుంచి వి. హనుమంతరావు అసెంబ్లీకి పోటీ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా రెండో దఫా కొనసాగుతున్న విహెచ్…. అసెంబ్లీకిపోటీ చేయడాన్ని చాలా మంది తప్పుపట్టారు. అయినా హైకమాండ్ లో ఉన్నపలుకుబడిని ఉపయోగించుకుని సీటు తెచ్చుకున్నారు. అంతా చేస్తే…. డిపాజిట్ కూడా దక్కించుకోకుండా ఘోరంగా ఓడిపోయారు విహెచ్. ఇలాంటి నేతలు పార్టీకి అవసరమా? అని కేడర్ నెత్తీ నోరూకొట్టుకున్నా పట్టించుకున్నవారు పార్టీలోకనిపించలేదు. లెక్కకు మించిన సీనియార్టీఉన్న నేతలంతా పార్టీకి అవసరమైన సూచనలు,సలహాలు ఇస్తే బాగుంటుంది కానీ…. ఇంకా తామే అన్నీ అనుభవించాలనుకుంటే పార్టీ ఎక్కడ ఎదుగుతుందని వాపోతున్నారట నాయకులు.
ఇలా తమ అవకాశాలన్నింటినీ సీనియర్లు తన్నుకుపోతున్నారని బాధపడుతున్న వారంతా… డిఎస్ నిష్ర్కమణను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇంకామిగిలిన సీనియర్లు కూడా పోతే బాగుంటుందని ఎదురు చూస్తున్నామని చెబుతున్నారట. డిఎస్ రాజీనామా తర్వాత పార్టీలో వస్తున్న ఈ పాజిటివ్ టాక్ టీ పీసీసీ నేతలకు జోష్ ఇచ్చిందట. ఇలా ఎవరుపార్టీ వదిలి వెళ్లినా తిరిగి పార్టీలోకి తీసుకోవద్దనే షరతు కూడా పెట్టాలని జూనియర్లు కోరుతున్నారట.